-కేంద్రం ఏకపక్ష నిర్ణయాలపై ఆందోళన
- పేదల నడ్డి విరుస్తోంది
- మాజీ ఎంపి రెడ్డెప్ప
పుంగనూరు ముచ్చట్లు:
కేందప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో పేద ప్రజల నడి విరుస్తోందని , ఉన్న పలంగా పెట్రోల్, డీజల్ ధరలు పెంచడాన్ని వైఎస్సార్‌సిపి వ్యతిరేకిస్తోందని, ధరలు తగ్గించే దాక పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చిత్తూరు మాజీ ఎంపి రెడ్డెప్ప హెచ్చరించారు. సోమవారం పార్టీ పిలుపు మేరకు పెట్రోల్, డీజల్ ధరలు పెంపుపై వైఎస్సార్‌సిపి నిరసన ర్యాలీ చేశారు. అంబేద్కర్ విగ్రహాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోకుల్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించి తహశీల్ధార్ రాముకు వినతిపత్రం అందజేశారు. రెడ్డెప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో గ్యాస్ సామాన్యుడికి అందుబాటులో లేకుండ పోయిందన్నారు. ప్రస్తుతం డీజల్, పెట్రోల్ ధరలు పెంచడం , పైగా ఖర్చులు తగ్గించుకోవాలంటు , తిరగడం ఆపేయాలంటు ప్రభుత్వం సూచనలు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామన్నారు. ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, బోయకొండ మాజీ చైర్మన్ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సిపి జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు ఇర్ఫాన్, అమరనాథరెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరైయ్యారు.


Tags;The struggle continues until petrol and diesel prices are reduced.