తహశీల్ధార్‌కు వినతిపత్రం అందజేత
పుంగనూరు ముచ్చట్లు:
కేందప్రభుత్వం పెట్రోల్, డీజల్ ధరలు పెంచడంపై వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి ల నియోజకవర్గ కేంద్రంలో నిరసన ర్యాలీని మాజీ ఎంపి రెడ్డెప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా , ఎంపిపి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు అమరనాథరెడ్డి, ఇర్ఫాన్ ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గోకుల్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్ధార్ రాముకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుంచి పార్టీ క్యాడర్ అధిక సంఖ్యలో నిరసన కార్యక్రమానికి హాజరైయ్యారు. ర్యాలీలో పెట్రోల్ , డీజల్ ధరలు తగ్గించాలని, వైఎస్సార్‌సిపి జిందాబాద్….పెద్దిరెడ్డి జిందాబాద్ అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల ఎంపిపి చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి నాధమునిరెడ్డి, ఉమ్మడి జిల్లాల ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సిపి సీమ జిల్లాల ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, మాజీ కౌన్సిలర్లు త్యాగరాజు, కిజర్‌ఖాన్, జెపియాదవ్, కాళిదాసు, రేష్మా, సాజిదాబేగం తో పాటు పార్టీ నాయకులు ఖాదర్, రాజేష్, సురేష్, మమ్ము, ఈశ్వర్, నయాజ్, అయాజ్, ప్రశాంత్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Protest Rally by YSRCP Against Hike in Petrol and Diesel Prices