May 18, 2026
Explore
ఆగిఉన్న లారీని ఢీకొన్న ఐచర్‌ వాహనం

ఆగిఉన్న లారీని ఢీకొన్న ఐచర్‌ వాహనం

May 18, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని నూతన బైపాస్‌ రోడ్డులో మరమ్మతులకు గురై రోడ్డు ప్రక్కన ఆపి ఉన్న లారీని ఐచర్‌ వాహనం ఢీకొన్న సంఘటన సోమవారం వేకువజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కడప నుంచి వి.కోటకు సిమెంటు లోడ్డుతో వెళ్తున్న లారీ మరమ్మతులకు గురికావడంతో డ్రైవర్‌ రోడ్డు ప్రక్కన నిలిపి ఉంచగా , మదనపల్లె నుంచి పలమనేరు వైపుగా వెళ్తున్న ఐచర్‌ వాహనం అతివేగంగా వచ్చి లారీని ఢీకొంది. ఈప్రమాదంలో రెండు వాహనాలకు ముందుభాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Eicher vehicle crashes into parked lorry.