May 18, 2026
Explore
30 లోపు రైతులు గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలి

30 లోపు రైతులు గుర్తింపు సంఖ్య నమోదు చేసుకోవాలి

May 18, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

రైతులకు డిజిటల్‌ గుర్తింపు సంఖ్యను ఇచ్చే పక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వ్యవసాయశాఖ ఏడి శివకుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో రైతులు ఈనెల 30లోపు ఏపిఎఫ్‌ఆర్‌ 11 అంకెల గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలన్నారు. రైతులకు గుర్తింపు సంఖ్య లేకపోతే వ్యవసాయం, అనుబంధశాఖల పథకాలు ప్రయోజనం లభించదన్నారు. అలాగే పిఎం కిసాన్‌, అన్నదాత సుఖీభవ తదితర ఆర్థిక సహాయం పొందేందుకు వీలుండదని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తింపు సంఖ్యను నమోదు చేసుకోవాలని కోరారు.

Tags: Farmers must register their identification numbers by the 30th.