పుంగనూరు ముచ్చట్లు:
సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత…యోగాతోనే సాధ్యం. సరైన సూచనలు, సలహాలు పాటిస్తూ సాధన చేస్తే ఒత్తిడిని జయించవచ్చునని మాస్టర్ వనిత తెలిపారు. సోమవారం స్థానిక అంబేద్కర్ భవనంలో ఉచితంగా యోగా శిక్షణా కార్యక్రమాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రమం తప్పకుండ యోగా చేయడం వలన శారీరక ధృడత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయన్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి ఆరోగ్య రుగ్మతల నుంచి బయట వేస్తుందని తెలిపారు. ఈ యోగా శిక్షణ 15 రోజుల పాటు కొనసాగిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ యోగాలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆరోగ్యవంతులుగా జీవించాలని ఆమె కోరారు.
Tags: Yoga Training… Protection of Health