May 18, 2026
Explore
50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్..

50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్..

May 18, 2026 | Andhra Pradesh

ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం

అమరావతిముచ్చట్లు:

భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణతో ఉత్పాదకత పెంచేందుకు, రైతులకు సాధికారత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణ ఉప మిషన్(SMAM) పథకాన్ని ప్రారంభించింది.

వ్యవసాయ యంత్రాలు, పరికరాలు వినియోగాన్ని ప్రోత్సహించడానికి సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకాన్ని ప్రవేశపెట్టారు.

చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలను 40-50 శాతం సబ్సిడీ ధరల్లో అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం

అర్హతలు

భారతదేశంవో శాశ్వత నివాసి అయి ఉండాలి.

18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి.

దరఖాస్తుదారు గత 7 ఏళ్లలో ట్రాక్టర్ సబ్సిడీని పొంది ఉండకూడదు.

ఎలా దరఖాస్తు చేయాలి?

1.డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ఫార్మ్ మెకనైజేషన్ అండ్ టెక్నాలజీ (GDPT) అధికారిక వెబ్‌సైట్ https://agrimachinery.nic.in/ పై క్లిక్ చేయండి.

  1. హోమ్‌పేజీలో Direct Benefit Transfer in Agriculture Mechanization అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  2. ఆ తర్వాత డాష్‌బోర్డ్ లో రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేయండి.
  3. రిజిస్ట్రేషన్ డ్రాప్-డౌన్ మెనూలో ఫార్మర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
  4. మీ రాష్ట్రం, ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, రైతుగా నమోదు చేసుకోండి.
  5. ఇతర సమాచారాన్ని జాగ్రత్తగా నింపి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా వ్యవసాయ యాంత్రీకరణ ఉప మిషన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేంద్రాలు SMAM యోజనతో సహా వివిధ ప్రభుత్వ పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సేవలతో పాటు అనేక రకాల సేవలను అందిస్తాయి.

కావాల్సిన పత్రాలు
గుర్తింపు ధృవీకరణ పత్రం

పాస్‌పోర్ట్ సైజు ఫొటో

ఫీల్డ్ సర్టిఫికేట్ ఫొటోకాపీ

బ్యాంకు పాస్‌బుక్

కుల ధృవీకరణ పత్రం

వ్యక్తిగత రైతులకు 50% (గరిష్టంగా రూ. 5 లక్షలు), FPOలకు 75% వరకు, కస్టమ్ హైరింగ్ సెంటర్లకు 40% (గరిష్టంగా రూ. 4 లక్షలు) సబ్సిడీ వస్తుంది.
నివాస ధృవీకరణ పత్రం

Tags:Tractor with a 50% subsidy, drone with a 100% subsidy…