May 18, 2026
Explore
ఏపీలో సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్..

ఏపీలో సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్..

May 18, 2026 | Andhra Pradesh

-ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ వృత్తిదారులకు, బీపీఎస్ కుటుంబాలకు ఉచిత కరెంట్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

బీసీ వర్గాల జీవనోపాధి అభివృద్ధి కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు.

బీసీ వర్గాలకు చెందిన రజకులు, స్వర్ణకారులు, నాయీ బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది.

ఉచిత విద్యుత్ వివరాలు

  1. సెలూన్లు (నాయీ బ్రాహ్మణులు): 200 యూనిట్లు ఫ్రీ
    2.లాండ్రీ షాపులు (రజకులు): 150 యూనిట్లు ఫ్రీ
  2. గోల్డ్ షాపులు (స్వర్ణకారులు): 100 యూనిట్లు ఫ్రీ
    4.గృహాలు (తెల్ల రేషన్ కార్డు): 100 యూనిట్లు ఫ్రీ

అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్
అర్హులైన లబ్దిదారులు సంబంధిత పత్రాలతో ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ (AE) కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

  1. ఆధార్ కార్డు
  2. రేషన్ కార్డు
  3. కుల ధృవీకరణ పత్రం
  4. ప్రస్తుత కరెంట్ బిల్లు / సర్వీస్ నెంబర్
  5. ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్

అత్యంత వెనుకబడిన వర్గాల్లోకి వచ్చే దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు మొదలైన 32 ఉప కులాలకు చెందిన లబ్ధిదారులకు ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికేట్ అవసరం లేదని అధికారులు తెలిపారు. అర్హులైన వృత్తిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Tags: Free electricity for salons and laundry shops in AP.