May 17, 2026
Explore
మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ఢీకొని ముగ్గరికి తీవ్రగాయాలు

మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ఢీకొని ముగ్గరికి తీవ్రగాయాలు

May 17, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెకు చెందిన ఓ నాయకుడు అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీ కొట్టి దంపతులతో పాటు వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మదనపల్లె మండలంలో చోటు చేసుకున్న ఘటనపై స్థానికుల కథనం.. స్థానిక అనపగుట్టకు చెందిన దంపతులు ద్విచక్ర వాహణంలో ఇంటికి వెళుతుండగా, మండలంలోని సిటిఎం రోడ్డు, తట్టివారిపల్లి సమీపంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్యా భర్తలతో పాటు వారి కుమారుడిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసరం విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

Tags: Three Seriously Injured After Being Struck by Tipper Illegally Transporting Soil