24 ఆఖరి గడువు
పుంగనూరు ముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపాలిటి పరిధిలో ఉన్న 31 వార్డులను 36 వార్డులుగా విభజించి ఏర్పాటు చేయడం జరిగిందని , దీనిపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఈనెల 24వ తేదీ లోపు లిఖిత పూర్వకంగా తెలపాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటిలోని జనాభా , వార్డుల సరిహద్దులను బట్టి 10 శాతం ఎక్కువ లేదా తక్కువ నిష్పత్తితో 36 వార్డులను ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్‌కు నివేదికలు పంపామన్నారు. కమిషన్ ఆదేశాల మేరకు వార్డుల వారీగా ఓటర్లను , సరిహద్దులు గూర్చి ప్రజల నుంచి అభ్యంతరాలను సేకరించాలని ఆదేశించిందన్నారు. ఈ మేరకు పట్టణ ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నామన్నారు. ఈనెల 24 లోపు అభ్యంతరాలను తమకు లిఖిత పూర్వకంగా తెలియజేస్తే , వాటిని పరిశీలించి ఎలక్షన్ కమిషన్‌కు పంపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Tags: Submit Objections Regarding the Division of Municipal Wards