May 17, 2026
Explore
18 న పెట్రోల్‌ , డీజల్‌ పెంపుపై వైఎస్సార్‌సిపి నిరసన

18 న పెట్రోల్‌ , డీజల్‌ పెంపుపై వైఎస్సార్‌సిపి నిరసన

May 17, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెంచడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌లు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ రాష్ట్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిదులు, మాజీ ప్రతినిదులు , పార్టీ క్యాడర్‌తో కలసి ఉదయం 10:30 గంటలకు స్థానిక తహశీల్ధార్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి, తహశీల్ధార్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Tags: YSRCP Protest Against Petrol and Diesel Price Hike on the 18th