పుంగనూరు ముచ్చట్లు:
రహదారులపై మైనర్లు మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి , ప్రమాదాలకు కారణమౌతున్నారని ఈ నేపధ్యంలో ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి పలు సూచనలు చేశారని తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు మైనర్లు వాహనాలను నడిపిన , ప్రమాదాలకు కారణమైన ఖచ్చితంగా తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనల మేరకు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. ఈ నిబంధనలను తల్లిదండ్రులు ఉద్ధేశపూర్వకంగానే ఉల్లంఘిస్తున్నారని, అలాంటి సమయంలో తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం ఎంతో అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపే సమయంలో మధ్యం సేవించడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం, వీలింగ్ చేయడంతో రహదారిపై ప్రయాణిస్తున్న అమాయక ప్రజలు కూడ ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మైనర్ల తల్లిదండ్రులు తక్షణమే చర్యలు తీసుకుని , మైనర్లకు ఎలాంటి వాహనాలు ఇవ్వవద్దని , ప్రమాదాలకు కారణం మైనర్లు కాకుండ చూడాలని కోరారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. తనిఖీలలో మైనర్లు పట్టుబడితే ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Tags: Parents can be sued if minors drive vehicles