May 17, 2026
Explore
జీవీపురంలో అడవి పంది బీభత్సం

జీవీపురంలో అడవి పంది బీభత్సం

May 17, 2026 | Andhra Pradesh

ఓబులవారిపల్లి ముచ్చట్లు:

ఓబులవారిపల్లి మండలం జీవీపురం గ్రామంలో ఆదివారం అడవి పంది బీభత్సం సృష్టించింది. ఉదయం 6 గంటల సమయంలో గ్రామ సమీపంలోకి వచ్చిన అడవి పంది ముగ్గురిపై దాడి చేసింది. ఈ ఘటనలో కె.హేమన్స్(9), డి.రూపస్(13), ఎస్.మహేశ్(30) గాయపడ్డారు. ఒకరికి కాలు విరగగా, మరొకరికి చేతి, తల, కాలికి గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవి పందుల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags: Wild Boar Wreaks Havoc in GV Puram