కేవీపల్లె ముచ్చట్లు:
కేవీపల్లె మండలం కలకటవారిపల్లి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో 9 మంది కూలీలు గాయపడ్డారు. దామలచెరువు నుంచి 12 మంది కూలీలు మామిడికాయలు కోయడానికి ట్రాక్టర్‌లో మారెళ్లకు బయల్దేరారు. మార్గమధ్యంలోని మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. డ్రైవర్ చుక్కలపాటి లక్ష్మయ్య(22) సురక్షితంగా బయటపడ్డాడు. క్షతగాత్రులను వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు ఇర్లపాలెం, ఎర్రవారిపాలెం గ్రామాలకు చెందిన వారిగా సమాచారం.
Tags: Tractor Overturns Near Pileru; 9 Injured