అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మదనపల్లె బీకేపల్లి కాలనీకి చెందిన శ్రీనివాసులు(35), అనిల్(30) ఇంటి వద్దే వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వ్యాపారం సరిగా సాగకపోవడంతో ఇద్దరూ కలిపి సుమారు రూ.22 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. అప్పులపై అసలు, వడ్డీలు చెల్లించాలని రుణదాతలు ఒత్తిడి తేవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి వారిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Tags: Brothers Attempt Suicide Due to Debt Distress