రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండలంలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. శనివారం మండలంలోని 13 పంచాయతీల్లో ఆటో ద్వారా పర్యటిస్తూ మహిళలకు చట్టబద్ధ హక్కులు, భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా బస్సు స్టాప్‌లు మరియు ప్రజా ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 112 లేదా 9121100558కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
Tags: Special Measures for Women’s Safety