May 17, 2026
Explore
బి.కొత్తకోటలో ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల ఆగ్రహం

బి.కొత్తకోటలో ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల ఆగ్రహం

May 17, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో ఆర్టీసీ అధికారులు సమయపాలన పాటించడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెకు వెళ్లాల్సిన బస్సులు 45 నిమిషాలుగా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లో బస్సులు ఏ సమయంలో వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బస్సుల సమయ సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, సమయానికి బస్సులు నడపాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

Tags: Passengers Outraged Over RTC Services in B. Kothakota