సుగవాసి ఆధ్వర్యంలో 50 మంది టీడీపీలో చేరిక
సుండుపల్లి ముచ్చట్లు:
కువైట్‌లో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఎన్నారై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కువైట్‌లోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, తెలుగు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, సుండుపల్లి మండల అధ్యక్షుడు రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గల్ఫ్‌లో రాయలసీమ వాసులు అధికంగా ఉన్నందున తిరుపతి నుంచి విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో షబ్బీర్ భాయ్ నాయకత్వంలో 50 మందికి పైగా యువకులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారిని నాయకులు ఆహ్వానించి సన్మానించారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని నాయకులు పేర్కొన్నారు.
Tags: TDP Mahanadu Celebrated Grandly in Kuwait