May 17, 2026
Explore
యువతకు డీఎస్పీ కృష్ణమోహన్ సీరియస్ వార్నింగ్

యువతకు డీఎస్పీ కృష్ణమోహన్ సీరియస్ వార్నింగ్

May 17, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని డీఎస్పీ కృష్ణమోహన్ సూచించారు. ఇటీవల పెరుగుతున్న బైక్ స్టంట్లు, మత్తు పదార్థాల వినియోగంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో కొంతమంది యువకులు రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేసేలా ప్రవర్తించవద్దన్నారు.

మత్తు పదార్థాలకు బానిసైతే భవిష్యత్తు నాశనం అవుతుందని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఇటీవల బైక్ స్టంట్లు చేస్తున్న యువకులను పట్టుకుని వారి తల్లిదండ్రులతో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. ఇకపై అల్లరి చర్యలు పునరావృతమైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కృష్ణమోహన్ హెచ్చరించారు.

Tags: DSP Krishna Mohan Issues Serious Warning to Youth