విజయవాడ ముచ్చట్లు:
క్యూ లైన్ లో వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం త్వరగా అయ్యేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు
భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ పర్యవేక్షణ చేసిన ఈఓ శీనా నాయక్
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రం.ఇంద్రకీలాద్రి క్షేత్రానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీగా కనిపించింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే దుర్గమ్మ వారి ఆలయ కార్య నిర్వహణ అధికారి శీనా నాయక్ ఇంద్ర కీలాద్రి ప్రాంగణంలో విస్తృతంగా పర్యటించారు.వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులకు సిబ్బందికు ఆదేశాలు ఇచ్చారు. క్యూ లైన్ లో వచ్చిన భక్తులు త్వరగా దర్శనం అయ్యేందుకు వీలుగా స్వయంగా దగ్గరుండి భక్తుల రద్దీ క్రమబద్ధీకరించి పర్యవేక్షణ చేసిన ఈవో.ఉద్యోగులు సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులతో పాటు త్వరగా దర్శనం అయ్యేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించడంతో అందుకు తగ్గట్టుగా సిబ్బంది భక్తులకు పలు సేవలు అందించారు.
Tags; Devotees flocked to Goddess Durga’s temple.