May 17, 2026
Explore
ఇంద్రకీలాద్రిపై భక్తులరద్దీ ‘

ఇంద్రకీలాద్రిపై భక్తులరద్దీ ‘

May 17, 2026 | Andhra Pradesh

ఇంద్రకీలాద్రి ముచ్చట్లు:

వేసవి సెలవులు
వివాహాల సీజన్, ఆదివారం రద్దీతో ఇంద్రకీలాద్రి క్షేత్రం భక్తులతో నిండిపోయింది.

దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో తెల్లవారు జాము నుండే అన్ని దర్శనం క్యూ లైన్లు కిక్కిరిసాయి.

భక్తులరద్దీ పరిస్థితి గమనించి ఆలయ ఈవో వికె శీనా నాయక్ వాకి టాకీ సహాయంతో భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లు పరిశీలన చేశారు.
భక్తులందరికి శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనం సులభతరంగా పూర్తి అవ్వాలనే ధ్యేయంతో అదనపు విధులు కేటాయించిన దేవాలయ సిబ్బంది క్యూ లైన్ల క్రమబద్దీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు.

ఉదయం 10.30 నుండే 500/- దర్శనం టికెట్ల అమ్మకాలు నిలుపుదల చేసి, అంతరాలయ దర్శనం పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారు. తిరిగి దర్శనము మధ్యాహ్నం1.30 నిమిషములకు అంతరాలయ దర్శనం తిరిగి ప్రారంభం అయినది.

ఆలయ ఈవో శీనానాయక్ అంతరాలయం వెలుపల నుండే దర్శనం చేసుకొని,క్యూ లైన్ల లోని భక్తులతో మాట్లాడి దర్శనంకు పట్టే సమయం గురించి తెలుసుకొని, వేగంగా అమ్మవారి దర్శనం అయ్యేలా భక్తుల రద్దీ క్రమబద్దీకరణ చేశారు.

ప్రధాన ఆలయం వెనుక భాగంలోని టికెట్ స్కానింగ్ పాయింట్ వద్ద చంటి బిడ్డల తల్లులు, వృద్దులు, వికలాంగులకు టిక్కెట్ తో సంబంధం లేకుండా ప్రత్యేక దర్శనలైన్ ద్వారా దర్శనం ఏర్పాటు చేయడమైనది.
పెరిగిన వేసవి ఎండలకు తగ్గట్టుగా భక్తులకు ఉపశమనం కలిగేలా
దేవస్థానం ఆధ్వర్యంలో సేవకుల ద్వారా మంచి నీరు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు విరివిగా పంపిణీ చేయడమైనది.

భక్తులకు వేసవి ఎండల నుండి ఉపశమనం కల్పించేందుకు ప్రధాన ఆలయం చుట్టు ప్రక్కలా ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళు క్రింద భక్తులు సేద దీరారు.కొండపైన, దిగువున చలివేంద్రాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడమైనది.

మొబైల్ ఫోన్ల తో హల్ చల్ చేస్తున్న భక్తులను కట్టడి చేసేలా చర్యలు తీసుకోమని కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు.
ప్రోటోకాల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు నుండి వచ్చిన దర్శనం విన్నపాలు పరిశీలన చేసి, క్రమబద్దీకరణ చేసి,
విపరీతంగా పెరిగిన భక్తులరద్దీ వలన ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేసామని, మధ్యాహ్నం 2 తర్వాత ఇంద్రకీలాద్రికి రావాలని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి పంపడమే ప్రస్తుత కర్తవ్యమని ఈవో రిఫరెన్స్ భక్తులకు నచ్చజెప్పారు.
ఓం టర్నింగ్ నుండి ఘాట్ రోడ్ వైపు ఉన్న చెప్పులు స్థాండ్, క్లోక్ రూమ్, మొబైల్ భద్రపరచే కేంద్రాలను ఈవో పరిశీలించి భక్తులతో మాట్లాడారు.
ఉచిత ప్రసాదం పంపిణీ, అన్న ప్రసాదం పంపిణీ పై చాలా సూచనలు ఇచ్చినారు

మధ్యాహ్నం నైవేద్యం సమయములో శ్రీ అమ్మవారికి నైవేద్యం కొరకు అన్ని దర్శనం క్యూ లైన్లు ఆపడంతో భక్తులరద్దీ తీవ్రంగా పెరిగింది

జాతీయ రహదారి పై రద్దీ పెరగడంతో ఘాట్ రోడ్ వైపు వాహనాల రాకపోకలు నిలుపుదల చేసి, దేవస్థానం బస్సులు, బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులను కొండపైకి చేర్చే చర్యలు జరుగుతున్నాయి.

వికె శీనా నాయక్ కామెంట్స్ :

  • ఈరోజు ఉహించని విధంగా ఇంద్రకీలాద్రిపై రద్దీ నెలకొంది. ఉదయం నుండే నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాను.
  • అటు స్వయంగా అన్ని ప్రదేశాలు తిరిగి, అనంతరం సిసి కెమెరాల ద్వారా భక్తులు రద్దీ చూస్తూ వాకీ టాకీ లో ఆదేశాలు ఇస్తున్నాను.
  • దేవాలయం సిబ్బందిఅంతా స్పెషల్ డ్యూటీ ల్లో ఉన్నారు. సేవకులు, పోలీస్ సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు అంతా శ్రమిస్తున్నాము.
  • వేసవి ఆదివారం కావడంతో ఇప్పటికే సుమారు 40 వేల మందికి పైగా భక్తులు వచ్చారని అంచనా
  • భక్తులకు మంచి నీరు, ప్రసాదం, భోజనం ఏర్పాట్లలో లోటు లేకుండా ఏర్పాటు చేసాము.
  • భక్తులరద్దీ అనుసరించి టిక్కెట్ల కొనుగోలు విషయంలో నిబంధనలు అనుసరిస్తూనే, కొన్ని సందర్భాలలో సడలింపు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులకు ప్రత్యేక లిఫ్ట్ ద్వారా తరలింపు, దర్శనానికి ఏర్పాటు
  • వేసవి సెలవులు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో రావదానికి ప్రధాన కారణమని భావిస్తున్నాము.వేసవి లో ఉండే రద్దీ ఎదుర్కోవడానికి VIP దర్శనాలు పై నియంత్రణ చేసాము.
  • రానున్న రోజులలో మరింత జాగ్రత్తలు వహిస్తాము.సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీ అమ్మవారి దర్శనం, ప్రసాదం, అన్న ప్రసాదం అందేలా చర్యలు తీసుకున్నాము. వేసవి ఎండ తీవ్రత వలన కొంతమంది భక్తులు ఇబ్బంది పడుతుండగా దేవస్థానం ప్రధమ చికిత్స కేంద్రంలో ఉపశమన చర్యలు తీసుకొని వైద్యం అందజేస్తున్నాము.

Tags: Crowds of devotees on Indrakeeladri