అమెరికాముచ్చట్లు:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరో వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం గల్ఫ్‌లో పరిస్థితులను తుపానుకు ముందు ప్రశాంతతగా అభివర్ణించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఏఐ చిత్రంతో కూడిన పోస్టు పెట్టారు. సముద్రంలో యుద్ధ నౌకలు, యూఎస్ నేవీ అడ్మిరల్, ఆయన ముందు తాను ఉన్న చిత్రాన్ని ట్రంప్ షేర్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ఇరాన్ నౌకలను కూడా చేర్చారు. అధ్యక్షుడు అనుమతిస్తే ఇరాన్‌పై దాడులకు వీలుగా రక్షణ శాఖ ఏర్పాట్లు చేసుకుంటోందన్న వార్తల నడుమ ఈ పోస్టు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తమతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ త్వరగా కుదుర్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందంతో ఇరాన్‌కే ప్రయోజనమని అంతకుముందు ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. ఇక అమెరికా సందేశాలు తమకు అందాయని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. చర్చలకు అమెరికా కూడా సుముఖంగా ఉందని చెప్పారు. అయితే, అమెరికాపై అపనమ్మకం పూర్తిగా తొలగిపోలేదని కూడా చెప్పారు.
ఏప్రిల్ 8న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అణ్వాయుధాల అభివృద్ధి, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి..
Tags: This is the calm before the storm — Trump’s warning to Iran.