నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
రాజస్థాన్‌లోని సికార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అరెస్ట్
కొడుకు కోసం రూ. 10 లక్షలు పెట్టి పేపర్ కొనుగోలు చేసిన తండ్రి
అయినా ఫెయిల్.. పరారీలో కొడుకు
లీకేజీ నెట్‌వర్క్‌తో సంబంధమున్న 150 మంది విద్యార్థులపై సీబీఐ నిఘా
అమరావతిముచ్చట్లు:
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాజస్థాన్‌లోని సికార్ జిల్లాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. తాజాగా ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దినేశ్ బివాల్, అతని సోదరుడు మంగీలాల్ బివాల్, మంగీలాల్ పెద్ద కుమారుడు వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Tags: Bought the ‘NEET’ paper for ₹10 lakhs… scored 107 out of 720 marks!