తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో లంచాన్ని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి విజయ్ మూడు నెలల గడువు విధించారని మంత్రి ఆదవ్ అర్జున తెలిపారు.
రాష్ట్రప్రభుత్వ కార్యాలయాల్లో లంచాన్ని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి విజయ్ మూడు నెలల గడువు విధించారని మంత్రి ఆదవ్ అర్జున తెలిపారు. జీసీసీ పరిధిలోని 94 నుండి 104 వార్డుల్లో జరుగుతున్న రోడ్ల విస్తరణ, డ్రైనేజీ పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో ఇక నుండి లంచం ముట్టజెప్పకుండా అన్ని పనులు చేయించుకోవచ్చని ప్రజలకు సూచించారు.
ప్రభుత్వ నిర్వహణ పారదర్శకంగా, నిజాయతీగా ఉండేందుకు సీఎం విజయ్ విధించిన మూడు నెలల గడువును అధికారులు గుర్తించాలన్నారు. ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో తిష్టవేసిన సమస్యలు, అలాగే ప్రజల కోరికలతో నివేదిక సమర్పించాలని తెలిపారు. వీధి దీపాలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను అన్ని ప్రాంతాల్లో మెరుగుపరచాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
మూసివేస్తున్న టాస్మాక్ మద్యం దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగులు నష్టపోకుండా వారిని ప్రభుత్వ శాఖల్లో నియమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. విద్యుత్‌కు సంబంధించిన ఫిర్యాదులపై ప్రజలు 9498794987 అనే టోల్‌ఫ్రీ నెంబరును సంప్రదించవచ్చని మంత్రి ఆదవ్ అర్జున తెలిపారు.
Tags: Putting an End to Bribery in Government Offices