ఎన్టీఆర్ ముచ్చట్లు:
పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేంద్ర ప్రసాద్..
కేంద్ర/మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం సిపిఎం పట్టణ కమిటీ తరఫున తిరువూరు బోసు బొమ్మ బస్ స్టాప్ సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు..
గతంలోనే సిపిఎం పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లను తెంచుతుంది అని చెప్పడం జరిగింది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం జరగదని ఎన్నికల ముందు ప్రకటించి ఉన్నారు..
ఎన్నికల అనంతరం డీజిల్ పెట్రోల్ ధరలను పెంచడం జరిగిందని రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనీసం నోరు మెదపడం లేదని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడంలో మోడీ బాబు పవన్ జగన్ కలసి నాటకాలు ఆడుతున్నారని ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ధరల పెంపుదలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనియెడల ప్రజలను కూడగట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ వి భద్రం గుల్లపల్లి వెంకటరత్నం పట్టణ కమిటీ సభ్యులు ఆకుల రవి చప్పిడి సురేష్ పంతంగి శ్రీనివాసరావు చెరుకు సత్యనారాయణ షేక్ నాగుల్ మీరా కూరపాటి వెంకటరత్నం పాకాల రామకృష్ణ మరకాల ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.
Tags: The Central Government should reduce the hiked prices of petrol, diesel, and gas.