May 16, 2026
Explore
ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి అనుమతి..!!

ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి అనుమతి..!!

May 16, 2026 | Andhra Pradesh

అహ్మదాబాద్ ముచ్చట్లు:

అద్దె చెల్లించలేని ఓ వ్యక్తి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కటకటాల వెనక్కి పంపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన బాధిత కుటుంబం మోర్బికి వలస వెళ్లింది. ఓ ఇంట్లో నెలకు రూ.2 వేలతో అద్దెకు దిగింది. భార్య, కుమార్తెతో కలిసి కుటుంబ యజమాని చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కొన్ని నెలలుగా వారిని తీవ్రమైన ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కనీసం కుటుంబాన్ని పోషించడానికి కూడా డబ్బులు లేకుంగా పోయాయి. మరోవైపు నాలుగు నెలల ఇంటి అద్దె బకాయి పడ్డారు. వారి ఆర్థిక సమస్యలను ఇంటి యజమాని ఆసరాగా చేసుకున్నాడు. అప్పటికే సదరు వ్యక్తి భార్య, కూతురిపై కన్నేసిన ఇంటి యజమాని.. అద్దె కట్టాలని బెదిరింపులకు దిగాడు.

డబ్బులు కట్టలేకపోతే అతని భార్య, కూతురుని తన వద్దకు పంపాలన్నాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో సదరు వ్యక్తి.. ఇంటి యజమాని వద్దకు తన భార్య, కూతురిని పంపించాడు. ఆ కీచకుడు మహిళ, ఆమె కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే, బాధిత మహిళ జరిగిన విషయాన్ని తన తల్లికి తెలియజేసింది. దీంతో ఆమె తన కూతురు, మనమరాలిని వెంట తీసుకొని మోర్బి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఇంటి యజమాని, మహిళ భర్తపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags: Unable to Pay Rent, Man Permits Rape of Wife and Daughter!!