May 16, 2026
Explore
టమోటలు తరలింపులో ఘర్షణ

టమోటలు తరలింపులో ఘర్షణ

May 16, 2026 | Andhra Pradesh

ఒకరికి కత్తిపోట్లు

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని మార్కెట్‌ యార్డులో టమోటలు లారీలో తరలించే విషయంలో ఇరువురి డ్రైవర్ల మధ్య మాటలు పెరగడం కారణంగా కత్తులతో పొడుచుకుని ఒకరు కత్తిపోట్లుకు గురైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మార్కెట్‌ యార్డులో టమోటలు తరలించేందుకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన డ్రైవర్లు సురేష్‌, మాయ కన్నన్‌ (45) ఇరువురు టమోటలు తరలించే విషయంలో ఘర్షణ పడ్డారు. వీరిరువురి మద్య మాటమాట పెరగడంతో డ్రైవర్‌ సురేష్‌ , మరో డ్రైవర్‌ మాయకన్నన్‌ను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలైయ్యాయి. మాయకన్నన్‌ పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు, వ్యాపారులు వెంటనే సురేష్‌ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మాయకన్నన్‌ ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేపట్టారు. పరిస్థితి విషయంగా ఉండటంతో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Clash over transport of tomatoes