May 16, 2026
Explore
జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

May 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వేసవిలో జ్వరాలు ప్రభలి ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని తూర్పు మొగసాల అర్భన్‌ పిహెచ్‌సి డాక్టర్‌ కిరణ్మయి తెలిపారు. శనివారం కొత్తపేట అర్భన్‌ పిహెచ్‌సి వైద్యాధికారి రమ్యక్రిష్ణ, యూనిట్‌ అధికారి గంగయ్య లతో కలసి పట్టణంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్‌ కిరణ్మయి మాట్లాడుతూ ప్రజలు నీటిని కాచివడపోసి తాగాలన్నారు. అలాగే వేసవి తీవ్రంగా ఉన్నందున పిల్లలు, పెద్దలు ఎక్కువుగా బయట తిరగరాదన్నారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తాగుతూ వడదెబ్బ నుంచి కాపాడుకోవాలన్నారు. అలాగే కుల్లిన పండ్లు, నిల్వ ఉంచిన ఆహారపదార్థాలను తినడంతో రోగాలు ప్రభలే అవకాశం ఉందన్నారు. తమ ఇండ్ల పరిసరాలలో నీటి నిల్వలు లేకుండ చూసుకోవాలన్నారు. నీటి నిల్వలు ఉంటే లార్వద్వారా దోమలు ప్రభలి మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రభలే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈర్యాలీలో సిబ్బంది సోమశేఖరాచారి, తేజోమూర్తి, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Tags: People should remain alert regarding fevers.