May 16, 2026
Explore
ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

May 16, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఆర్టీసి డిపో ఎదుట ఆర్టీసి ఉద్యోగులు నిరసన చేపట్టారు. శనివారం ఆర్టీసి ఉద్యోగులు శ్రీ పథకం అమలుతో ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని , ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు పనిభారం పెంచుతోందన్నారు. ఓవర్‌ టైం సర్వీసులు రద్దు చేసి సింగల్‌ డ్యూటిలు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో సెలవు మంజూరు చేయడం లేదని , మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని తెలిపారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

Tags: Resolve the issues of RTC employees.