May 16, 2026
Explore
భక్తి శ్రద్దలతో శనేశ్వరస్వామి జయంతి పూజలు

భక్తి శ్రద్దలతో శనేశ్వరస్వామి జయంతి పూజలు

May 16, 2026 | Andhra Pradesh

పుంగనూరు

శనేశ్వరస్వామి జయంతిని పురస్కరించుకుని ఆలయాలలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని రాగానిపల్లె రోడ్డులో గల శనేశ్వరాలయం , యాబైరాళ్ల మొరవ వద్ద గల శనేశ్వరాలయాలలో వేకువజాము నుంచి స్వామివార్లకు హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివార్లకు ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలలో నువ్వుల దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Shaneshwara Swamy Jayanti rituals performed with devotion and reverence.