May 16, 2026
Explore
యువతా మేలుకో…. సమయం విలువ తెలుసుకో అంటూ… “స్ఫూర్తి

యువతా మేలుకో…. సమయం విలువ తెలుసుకో అంటూ… “స్ఫూర్తి

May 16, 2026 | Andhra Pradesh

శ్రీ సత్యసాయి ముచ్చట్లు:

” పేరుతో క్రికెట్ టోర్నమెంట్ ను సికేపల్లి లో ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్

యువత చెడు మార్గాల వైపు పయనించకూడదు, ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చిన ఎస్పీ ..

తప్పు చేసిన వారిపట్ల పోలీసులు కఠినంగా ఉంటారు… సన్మార్గంలో వెళ్లే వారి పట్ల ఫ్రెండ్లీగా ఉంటారన్న ఎస్పీ…..

“స్ఫూర్తి” పేరుతో యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..

రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల క్రీడాకారులకు 10 రోజులపాటు క్రికెట్ టోర్నమెంట్…

టీం క్రీడలతో ఏదైనా సాధించవచ్చు, చదువుతోపాటు యువతకు క్రీడలు ముఖ్యమే..

యువత కుల ,మతాలు, రాజకీయాలు పేరుతో వేరు వేరు అవుతున్నారు, వాటికి అతీతంగా ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్లాలని పిలుపు………

శాంతిభద్రతల పరిరక్షణలో యువత పోలీసులకు సహకరించాలి..

జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్

యువత మేలుకో సమయం విలువ తెలుసుకో చెడు మార్గాలను వీడి ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లి విజయం సాధించాలని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
శ్రీ సత్యసాయి జిల్లా సికెపల్లి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “స్ఫూర్తి ” పేరుతో యువతలో చైతన్యం నింపేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్పీ ప్రారంభించారు.
ఇందులో సికె పల్లి, రామగిరి , కనగానపల్లి మండలాల నుండి 54 టీములు పాల్గొన్నారు..

ఇందులో గెలుపొందిన మొదటి బహుమతి రూ 40 వేలు…
రెండో బహుమతి 30, వేలు..
తృతీయ బహుమతి 20, వేలు, కన్సోలేషన్ బహుమతి 10, వేలు అందజేయనున్నారు

ఈ సందర్భంగా ఎస్పీ యువతలో చైతన్యం నింపే ప్రసంగం చేశారు….
చెడు మార్గాలను వీడి సన్మార్గంలో పయనిస్తే విజయం సాధిస్తామన్నారు. కులాలు మతాలు రాజకీయాల పేరుతో యువత వేరు కావద్దు, సమాజ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలియజేశారు. ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే యువత ఎక్కువగా మన దేశంలోనే ఉన్నారని, యువత గంజాయి, మద్యంకు బానిసలవడంతోపాటు నేరాలలో పాల్గొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అటువంటి వాటికి స్వస్తి ఫలకాలన్నారు. మహిళల బాలికల జోలికి వెళ్లి పోక్సో కేసులలో చిక్కుకుంటున్నారని తెలియజేశారు. వాహనాల్లో వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ సీట్ బెల్టు హెల్మెట్ ధరించాలని సూచించారు.

కుల మత రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. పోలీసులు చెడు చేసిన వారి పట్ల మాత్రమే కఠినంగా ఉంటారని మంచిగా ఉన్న వారితో స్నేహపూర్వకంగా ఉంటారని స్పష్టం చేశారు.

సమయం ఎంతో విలువైనదని వృధా చేసుకోకుండా ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు. సమిష్టి క్రీడలతో ఏదైనా సాధించవచ్చు అన్నారు. చదువుతోపాటు యువతకు క్రీడలు కూడా ముఖ్యమేనని తెలియజేశారు
. శాంతి భద్రతల పరిరక్షణలో యువత పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

యువతలో చైతన్యం నింపి సన్మార్గంలో పయనించేలా చేసేందుకు రామగిరి సర్కిల్ లో ఉన్న మండలాల క్రీడాకారులకు ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. శాంతి భద్రతల తోడ్పాటుకు యువత సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని రామగిరి సర్కిల్లోని సిఐ మహమ్మద్ అలీ, ఎస్సైలు సత్యనారాయణ, మహమ్మద్ రిజ్వాన్ ,, ప్రదీప్ సహకారం అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags: “Youth, wake up! Realize the value of time”—thus speaks ‘Spurthi’.