తిరుపతి ముచ్చట్లు:
సత్యవేడు మండలం పెద్దఈటిపాకం గ్రామానికి సమీపంలో ద్విచక్ర వాహనంతో పాటు యువకుడు ఒకరు మృతి చెందారు.బుధవారం కొందరు గ్రామస్తులు దీన్ని గుర్తించారు. మృతి చెందిన యువకుడు వయసు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల లోపు ఉంటుందని చెప్తున్నారు. పెద్దఈటిపాకం వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న చింత చెట్టుకు ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో వాహనంతో పాటు యువకుడు అక్కడే ఉన్న గుంతలో కింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది.రెండు రోజుల క్రితమే ఈ ప్రమాద సంఘటన జరిగినట్టు గ్రామస్తులు పేర్కొంటున్నారు.దీనిపై శ్రీసిటీ పోలీసులు స్పందించి మృతి చెందిన యువకుడు చిరునామా, ఎక్కడ పని చేస్తున్నారు వంటి విషయాలపై దర్యాప్తు చేయాల్సి ఉంది.
Tags: Unidentified Youth Dies Near Pedda Eetipakam Village