శ్రీ సత్యసాయి ముచ్చట్లు:
రెండు కేసులకు సంబందించిన దొంగ సొత్తు రూ. 10,00,000 లక్షల నగదు స్వాధీనం.
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సి ఐ B.శేఖర్ …
శ్రీ సత్యసాయి జిల్లా S.సతీష్ కుమార్ ఆదేశాలతో, పెనుకొండ SDPO U.నరసింగప్ప పర్యవేక్షణలో, గోరంట్ల అప్గ్రేడ్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ B.శేఖర్ వారి సిబ్బంది SI రామచంద్ర, WSI J.నిర్మల మరియు క్రైమ్ సిబ్బంది విజయనగరం మరియు అనకాపల్లి జిల్లా లకు చెందిన దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు కేసులకు సంబందించిన 10,00,000/- (పది లక్షలు) నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అరెస్టు అయిన దొంగల వివరాలు:-
రావుల ఆనంద్, వయస్సు 31 సంవత్సరములు s/o లేట్ సుబ్బారావు, ఎరుకుల కులము, కూలి, నివాసము: గొట్లం గ్రామము, పాతవలస పోస్ట్, K.కొత్తపాడు మండలము, అనకాపల్లి జిల్లా.
గుమ్మడి సురేష్ @ సూరి, వయస్సు 27 సంవత్సరములు s/o అప్పన్న, కాపు కులము, కూలి, నివాసము: D.No 10-02, కొత్తవలస గ్రామము మరియు మండలము, విజయనగరము జిల్లా.
నంబారు సుధీర్, వయస్సు 27 సంవత్సరములు s/o సత్యనారాయణ, నివాసము: గొల్లలపాల్యం గ్రామము, కొత్తవలస మండలము, విజయనగరము జిల్లా.
కోరుకొండ త్రిమూర్తులు, వయసు 27 సంవత్సరాలు s/o లేట్ సత్యరావు, బలిజ/కాపు కులము, లారీ డ్రైవరు, నివాసము ఇంటి నెంబర్ 2-46, కొత్తూరు ముత్యాలమ్మపాలెం, దేవరపల్లి మండలం అనకాపల్లి జిల్లా.
నిందితుల నేపథ్యం.
అరెస్టు అయిన దొంగలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశముతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో పలు దొంగతనాలు మరియు గొడవ కేసులలో జైలుకు పోయి, అక్కడి నుండి విడుదల అయ్యి అందరూ కలిసి గోరంట్ల గ్రామములొ 02.04.2024 వతేదీ చైతన్య స్కూల్ ఎదురుగా పార్క్ చేసిన స్కూటీ డిక్కీలో దాచిన 5,90,000/- నగదును మరియు 14.07.2025 వతేదీ వాసవీ కళ్యాణ మండపం ఎదురుగా కారు అద్దాలు పగులకొట్టి కారులో ఉంచిన 7,00,000/- నగదును దొంగలించినారు.
స్వాధీనం చేసుకున్నప్రాపర్టీ వివరములు:-
Cr.No. 115/2025 U/sec 324(4), 303(2) BNS of Gorantla UPS కేసులో రూ,6,00,000 లక్షల నగదు.
Cr.No. 92/2024 U/sec 303(2) BNS of Gorantla UPS కేసులో రూ. 4,00,000 లక్షల నగదు.
ఈ సంధర్భంగా సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు S.సతీష్ కుమార్, దొంగలను అరెస్టు చేసిన గోరంట్ల CI ని మరియు సిబ్బందిని అభినందించడమైనది.
Tags:Inter-state thieves involved in thefts arrested.