– ఘనంగా నివాళులర్పించిన జిల్లా పోలీసులు
అనకాపల్లి ముచ్చట్లు:
మన్యం వీరుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా, అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి, పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఆయన త్యాగాలను స్మరిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి సమర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన ధీశాలి అల్లూరి అని, సాయుధ పోరాటం ద్వారానే స్వేచ్ఛ సాధ్యమని నమ్మిన మహనీయుడని కొనియాడారు.గిరిజనుల హక్కుల కోసం, వారిపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మన్యం ప్రజలను ఏకం చేసిన తీరు అద్వితీయమని పేర్కొన్నారు.1924 మే 7న ఆయన భౌతికంగా మనకు దూరమైనా, ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్.బి డిఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, ఇన్స్పెక్టర్లు టీ.లక్ష్మి, సేనం రమేష్, పిల్లా రమేష్, బి.రామకృష్ణారావు, ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు, సురేంద్ర కుమార్ మరియు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొని అల్లూరి కి నివాళులు అర్పించారు.అల్లూరి వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ సేవలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పోలీసు శాఖ పిలుపునిచ్చింది.
Tags: Death Anniversary of the Revolutionary Beacon, Alluri Sitarama Raju