పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు ఎన్. జి. వో కాలనీ లోని రాజు క్షత్రియ సేవ సంఘం కార్యాలయం నందు క్షత్రియ సేవ సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం రాజు,లక్ష్మణ రాజు,జగదీశ్ రాజు,నాగరాజు, చంద్రశేఖర్ రాజు,భాస్కర్ రాజు ల ఆధ్వర్యంలో నేడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తెలుగు వాడి సత్తా చాటి బ్రిటిష్ సామ్రాజ్యన్ని గడగడా లాడించిన స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కి ప్రతి ఒక్కరు అయన ను స్మరించు కొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమం లో కృష్ణమ రాజు,నవీన్ రాజు, విజయ్ భాస్కర్ రాజు, సతీష్ రాజు, రాఘవేంద్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags: The Raju Kshatriya Seva Sangham paid grand tributes on Alluri’s death anniversary.