పుంగనూరుముచ్చట్లు:
శ్రీ సోమేశ్వరస్వామి బ్రహ్మత్సవాలలో భాగంగా పట్టణంలోని శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి బ్రహ్మత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీ పార్వతి , పరమేశ్వరులు ఊరేగించే వాహనానికి రంగులు వేసి సుందరంగా అలంకరించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వివిధ వాహన సేవలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్గ్మత్సవాలు 11 రోజుల పాటు నిర్వహించి భక్తులకు స్వామి దర్శనభాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు.
Tags: Sri Someswara Swamy Brahmotsavams Begin on the 25th