పుంగనూరుముచ్చట్లు:
స్థానిక ఆర్టీసి డిపోలో ఇంధనం పొదుపులో అత్యంత కృషి చేసిన డ్రైవర్లు జాబీర్, నాగరాజ, కండెక్టర్ అబుబకర్, భార్గవి, జిలానిబాషా లకు బహుమతులను పంపిణీ చేశారు. సోమవారం మేనేజర్ దినేష్ ఆధ్వర్యంలో డిపోలో జరిగిన కార్యక్రమంలో డ్రైవర్లు, కండెక్టర్లకు శాలువకప్పి సన్మానించారు. ఇంధన పొదుపులో డ్రైవర్లు చూపుతున్న కృషి అభినందనీయమన్నారు. డిపోలోని డ్రైవర్లు అందరు వారిని ఆదర్శంగా తీసుకుని ఇంధన పొదుపు చేయాలని డిఎం కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్ వైజర్ మురళి, అసిస్టెంట్ మేనేజర్ మన్యం తదితరులు పాల్గొన్నారు.
Tags: Gifts for RTC Drivers