తిరుపతి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పట్టువస్త్రాలను సమర్పించారు.
శ్రీ తిరుమలనాధ స్వామి ఆలయానికి టిటిడి చైర్మెన్ చేరుకోగానే ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనాంతరం ఆలయ అధికారులు, అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం తిరు కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ, తిరుమల పేరుతో తిరుమలనాధ స్వామి ఆలయం ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న శ్రీ తిరుమలనాధ స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని తెలిపారు. ఈ ఆలయ అభివృద్ధికి టిటిడి సహకారం అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీర్ మార్ మల్లన్న, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags: TTD Chairman Presents Silk Robes to Sri Tirumalanatha Swamy.