March 13, 2026
Explore
27న న్యాయవాదుల సంఘ ఎన్నికలు

27న న్యాయవాదుల సంఘ ఎన్నికలు

March 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఆదేశాల మేరకు ఈనెల 27న పుంగనూరు న్యాయవాదుల సంఘ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల అధికారులు మల్లికార్జునరెడ్డి తెలిపారు. శుక్రవారం న్యాయవాదుల సంఘ సమావేశాన్ని ప్రస్తుత అధ్యక్షుడు చెన్నకేశవులు ఆధ్వర్యంలో నిర్వహించారు. షెడ్యూల్‌ మేరకు ఎన్నికల అధికారులుగా మల్లికార్జునరెడ్డి, వెంకటరెడ్డి , అంజిబాబులను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సంఘ ఎన్నికల నామినేషన్లు, పరిశీలన , షెడ్యూల్‌ను తెలియజేస్తామన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు.

Tags: Advocates’ Association Elections on the 27th