- అంజుమన్ కమిటి పిలుపు
పుంగనూరుముచ్చట్లు:
రంజాన్ మాసంలో ముస్లింలకు వైఎస్సార్‌సిపి రీజనల్ కోఆర్డినేటర్ , ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి కలసి శనివారం రాత్రి ఇచ్చే ఇఫ్తార్‌విందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, అంజుమన్ కమిటి అధ్యక్షుడు ఎంఎస్.సలీం కోరారు. శుక్రవారం సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము లతో కలసి ముస్లింలు సమావేశమైయ్యారు. ఎమ్మెల్యే, ఎంపి ప్రతియేటా నియోజకవర్గంలోని ముస్లింలకు ఇఫ్తార్‌విందు ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతోందని, ఈ ఇఫ్తార్‌విందులో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు జాఫర్, అజీజ్, ఇర్ఫాన్, ఇంతియాజ్, మహబూబ్‌బాషా, ఇస్మయిల్, జలీల్, నజీర్, అమ్ముకుట్టి, మహమ్మదాలి తదితరులు పాల్గొన్నారు.
Tags: Make the Iftar feast on the 14th a success.