March 13, 2026
Explore
ఎండోమెంట్‌వారిచే శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని స్వాధీనం

ఎండోమెంట్‌వారిచే శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని స్వాధీనం

March 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎన్నో ఏళ్లుగా ఆలయ ధర్మకర్తలు , ఎండోమెంట్‌శాఖ చేస్తున్న న్యాయపొరాటంలో ఎట్టకేలకు ఎండోమెంట్‌వారు విజయం సాధించారు. లక్షలాది రూపాయలు ఆదాయం ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని శుక్రవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్‌ ఆలయానికి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ను నియమించి, ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో పి.రమణ , ఇన్‌స్పెక్టర్‌ శశికుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వెంకట్రమణ, సీఐ సుబ్బరాయుడు , సీనియర్‌ న్యాయవాది వెంకట్రామయ్యశెట్టితో పాటు రెవెన్యూ అధికారులు, పట్టణ ప్రముఖుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో దేవాదాయశాఖ హుండీని ఏర్పాటు చేసి, బోర్డులు ఏర్పాటు చేశారు. ఈవో రమణ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని సీల్‌ చేసిన హుండీని ఆలయంలో పెట్టి, తాళాలు జిల్లా అధికారులకు పంపామన్నారు. త్వరలోనే ఆలయానికి సంబంధించిన నగలు, నగదు , ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.

Tags: Sri Virupakshi Maremma Temple Taken Over by the Endowments Department