నగరి ముచ్చట్లు:
వైఎస్ఆర్సిపి పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరి మున్సిపాలిటీ పరిధిలోని నగరి పట్టణం టవర్ క్లాక్ వద్ద మాజీ మంత్రి ఆర్కే రోజా పార్టీ జెండాను ఎగరవేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు, ప్రజల పట్ల ఆయన చూపిన సేవా భావం ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్తకు ఆదర్శమని పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు.
అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ మరింత బలపడేందుకు అందరూ ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: Grand celebrations in Nagari on the occasion of YSRCP party’s 16th foundation day – *Former Minister RK Roja