భూపాలపల్లి ముచ్చట్లు:
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో నూతన ఎస్సైగా అమూల్య బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎస్సై దాసరి సుధాకర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో అమూల్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ, మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని, ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా సంప్రదించాలని తెలిపారు.
Tags: Amulya becomes new SS of Tekumatla Mandal