చిన్నమండెం ముచ్చట్లు:
చిన్నమండెం మండలంలో మహిళా రైతులకు వాతావరణానికి అనుకూలమైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. వర్షాలు కురవకముందే విత్తనాలు వేసే విధానం, గుళికల రూపంలో విత్తనాల తయారీ, మరియు బహుళ పంటల సాగు వల్ల కలిగే లాభాలను ప్రాజెక్టు మేనేజర్లు వివరించారు. సామూహిక వ్యవసాయంతో పాటు, విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించారు.
Tags: Awareness on cultivation methods for women farmers