అమరావతిముచ్చట్లు:
రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా SIPB ప్రతిపాదించిన భారీ పెట్టుబడులకు కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. రూ.39,436 కోట్ల విలువైన మొత్తం 31 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టనుంది.
Tags: Green Signal for Investments Worth Rs 39,436 Crore!