April 10, 2026
Explore
పంచలోహ విగ్రహం చోరీ – గ్రామస్తుల్లో ఆందోళన

పంచలోహ విగ్రహం చోరీ – గ్రామస్తుల్లో ఆందోళన

April 10, 2026 | Andhra Pradesh

సంబేపల్లె ముచ్చట్లు:

సంబేపల్లె మండలం నాగిరెడ్డిగారి పల్లె గ్రామం వట్టంవాండ్లపల్లెలో ఉన్న సుమారు 150 ఏళ్ల పురాతన చౌడేశ్వరి దేవి ఆలయంలో పంచలోహ విగ్రహం చోరీకి గురైంది.

గ్రామస్తుల వివరాల ప్రకారం… సుమారు మూడు కిలోల బరువున్న అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని బుధవారం రాత్రి దుండగులు అపహరించినట్లు తెలిసింది. ఆలయాల్లో హుండీలతో పాటు దేవతా విగ్రహాలనే లక్ష్యంగా చేసుకోవడం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

విగ్రహం చోరీ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా రాయచోటి రూరల్ సీఐ రోషన్, ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags; Panchaloha Idol Stolen – Anxiety Among Villagers