April 10, 2026
Explore
దళితుడిపై మదనపల్లి సీఐ దాడి

దళితుడిపై మదనపల్లి సీఐ దాడి

April 10, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో దళితుడిపై పోలీసు అధికారి దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. గాంధీపురానికి చెందిన రామయ్యను ఒక స్థలం వివాదంపై విచారణకు పిలిచిన సీఐ కళా వెంకటరమణ తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు.

ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినా సమాధానం ఇవ్వకుండా తనను, తనతోపాటు వచ్చిన మహిళను పక్కకు నెట్టేశారని రామయ్య వాపోయాడు. ఆ భూమి వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఐ బెదిరించాడని తెలిపాడు.

దాడిలో గాయపడిన రామయ్య ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Madanapalle CI Attacks Dalit Man