మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం స్థానిక మోడ్రన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గంగాధర్ మృతి పట్ల పాత్రికేయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మృతదేహాన్ని దేవళం వీధిలోని నివాసానికి తరలించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
Tags: Madanapalle Reporter Gangadhar Dies of Heart Attack