మదనపల్లె ముచ్చట్లు:
ధృవీకరణ పత్రం అందుకున్న ప్రిన్సిపాల్ వనజ
మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఆడిట్‌ను కళాశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆడిటర్లుగా విచ్చేసిన డాక్టర్ రుక్మిణి, డాక్టర్ గులాబ్ జాన్ కళాశాలలోని రికార్డులను సమగ్రంగా పరిశీలించి, నిర్వహణ విధానాలను తనిఖీ చేసి ధృవీకరించారు. ఆడిట్ ఫలితంగా కళాశాలకు ‘ఎ’ గ్రేడ్ లభించినట్లు ప్రిన్సిపాల్ వనజ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్ రావడం గర్వకారణమని, దీనికి అధ్యాపకుల కృషి ముఖ్య కారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
అకాడమిక్ ఆడిట్ ద్వారా విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, విద్యార్థుల అభివృద్ధి అంశాలను సమీక్షించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు, నాక్ (NAAC) గ్రేడింగ్‌కు సిద్ధమయ్యే దిశగా తీసుకోవలసిన చర్యలపై ఆడిటర్లు ఎగ్జిట్ మీటింగ్‌లో సూచనలు, సలహాలు అందించారు.
రికార్డుల పరిశీలన కార్యక్రమం అకాడమిక్ కోఆర్డినేటర్ వి. గురుమూర్తి, ఐక్యూఎసి కోఆర్డినేటర్ టి.టి.పి. మోహన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.
Tags: Women’s Degree College Awarded ‘A’ Grade in Academic Audit