రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణంలోని రాయుడు కాలనీలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ‘వాక్ విత్’ కార్యక్రమం నిర్వహించారు. శానిటేషన్ అధికారి నరసింహ, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్, తాగునీటి విభాగాల అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు సక్రమంగా రావడం లేదని, రోడ్లు, డ్రైనేజీ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. చెత్త సేకరణ, వీధి లైట్లు, పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి, మిగతావాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
Tags: Efforts Underway to Resolve Issues in Rayudu Colony: Commissioner Ramana Reddy