శ్రీ సత్య సాయి ముచ్చట్లు:
తమిళనాడు ఎలక్షన్ డ్యూటీ కి వెళ్లే హోంగార్డ్స్ కి విధులపై అవగాహన..
ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి…
రాయలసీమ రీజియన్ ఇన్ఛార్జి హోంగార్డ్స్ కమాండెంట్ యమ్.మహేష్ కుమార్*
పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాయలసీమ రీజియన్ ఇన్ఛార్జి హోంగార్డ్స్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.
స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని హోంగార్డ్స్ ఈరోజు పరేడ్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో కమాండెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని పరేడ్ తనిఖీ చేశారు. అనంతరం హోంగార్డ్స్ ను ఉద్దేశించి మాట్లాడారు.
త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికల విధులకు వెళ్లే హోంగార్డ్స్ కు అక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలి , ఓటర్లతో ఎలా నడుచుకోవాలో అన్న విషయాలపై హోంగార్డ్స్ కి దిశా నిర్దేశం చేశారు.
ప్రతి హోంగార్డు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,
ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలని, హోంగార్డ్స్ ల దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవేనన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఆరోగ్యాంగా ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు..విధుల్లో నైపుణ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవాలని, పలు మెళకువలు సూచించారు.
అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇన్సూరెన్స్ లు రెన్యువల్ అవుతున్నాయా లేదా చూసుకొంటూ ఉండాలని, ఏదైనా సమస్య వస్తే సబ్ డివిజన్ ఇంచార్జీ ల ద్వారా పరిష్కారం పొందాలని, లేదా ఆర్ఐ కి సమస్యను తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు
అనంతరం దర్బార్ నిర్వహించి హోంగార్డుల సమస్యలు, తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ దృష్టికి తీసికెళ్లి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.ఈ కార్యక్రమంలో A R dsp శ్రీనివాసులు, R i , వలి, R S i ప్రదీప్ సింగ్, మరియు హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Duties must be performed in a manner that enhances the prestige of the Police Department